bezzipuram youth club receives prime minister’s praise

ప్రధాని ప్రశంసలు అందుకున్న బెజ్జిపురం యూత్ క్లబ్
మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రశంశల జల్లులు. భారత్ న్యూస్
లావేరు, నవంబర్ 26 : శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం యూత్ క్లబ్ సేవాకార్యక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లులు కురిపించారు . స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యూత్ క్లబ్ ఆదర్శనీయమైనా సేవలందిస్తుందని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 7000 మంది మహిళలకు స్వయం ఉపాధి రంగంలో స్దిరీకరింప చేసి వారి ఆర్థిక సమృద్ధి కి యూత్ క్లబ్ దోహదపడుతుందని కితాబు ఇచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యూత్ క్లబ్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. న్యూ స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆదర్శంగా సాగిస్తున్నారని అదేవిధంగా గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారని ఇవన్నీ ఆదర్శంగా ఉన్నాయని ప్రధాని కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ క్లబ్ సేవలను విస్తరింప చేసేందుకు యోచిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో యూత్ క్లబ్ కార్యక్రమాలను ప్రత్యేకంగా మోడీ ప్రశంసించడంతో జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బి.లాట్కర్ యూత్ క్లబ్ డైరెక్టర్ ఎం. ప్రసాద్ రావు ను క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రత్యేకించి ఫోన్ చేసి అభినందించారు.