పాలకుల వెన్ను వణికేలా,బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం…*

భారత్ న్యూస్ కోడూరు

పాలకుల వెన్ను వణికేలా

బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం…*

తీరప్రాంత గ్రామాలలో అధికార పార్టీ వెన్ను వణికేలా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం సాగింది.

బుధవారం ఉదయం కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో మొదలు పెట్టిన ప్రచారం హంసలదీవి, ఉల్లిపాలెం, హరిపురం, స్వతంత్రపురం, కోడూరు మీదుగా నక్కవానిదారి, లింగరెడ్డిపాలెం, చిన గుడిమోటు, పెద గుడిమోటు, పోటుమీద, జార్జిపేట, మందపాకల, చింతకోళ్ల, జరుగువానిపాలెం, పాదలవారిపాలెం ల వరకు సాగింది.

ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి వివిధ గ్రామాలలో అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ గ్రామ మహిళలు హారతులు ఇస్తూ తమ గ్రామాలకు స్వాగతం పలికారు.

మళ్ళీ వచ్చేది బుద్ధప్రసాదే అంటూ మహిళలు సైతం ఆనందోత్సాహంతో నినాదాలు చేశారు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి లేక తామెంత విసుగెత్తిపోయామో బుద్ధప్రసాద్ కి తమ ఆవేదన తెలియచేసారు. ఐదేళ్లుగా సాగు, త్రాగు నీరు లేక తాము ఎంత ఇబ్బందులకు గురయ్యారో తెలిపారు. తాము ఇప్పుడు నడిచే రహదారులు అన్నీ కూడా బుద్ధప్రసాద్ హయాంలో వేసినవి మాత్రమేనని, వైసీపీ పాలనలో కొత్త రోడ్లు వేయలేదు సరికదా, పాడయిన రోడ్లను కనీసం మరమ్మత్తులు కూడా చేయలేదని విమర్శించారు..

మళ్ళీ మీరే రావాలి, మా గ్రామాల్లో అభివృద్ధి జరగలంటూ గ్రామ ప్రజలు బుద్ధప్రసాద్ కి చెప్తూ అపూర్వ స్వాగతం పలికారు..

మండలి బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు, ప్రతి చేతికి పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అవినీతి పాలనలో కోడూరు మండలం రైతాంగం ఐదేళ్లపాటు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని, ఎకరాకు 45 బస్తాలు పంట పండే భూమిని ఐదేళ్లుగా భీడు పట్టించిన ఘనత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు దక్కిందని అన్నారు. దాదాపు 5000 ఎకరాల పొలం భీడు పడితే కనీసం రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కూడా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు ఆలోచన రాలేదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో నలుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి సింహాద్రి రమేష్ కళ్ళు తెరవలేదని బుద్ధప్రసాద్ అన్నారు.