మెదక్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక నియోజకవర్గం,ప్రధానిగా ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు,,

భారత్ న్యూస్ హైదరాబాద్…

మెదక్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక నియోజకవర్గం

ప్రధానిగా ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రగతికి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చు

రఘునందర్ రావు దుబ్బాక ప్రగతికి నిధులు తేలేకపోయిన అసమర్థుడు

బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రజల భూములు ఆక్రమించుకున్న దోపిడీదారుడు

రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాల్గొననున్న నర్సాపూర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి కొండా సురేఖ

ప్రజల కోసం పాటుపడే బిసి బిడ్డ అయిన నీలం మధును లక్ష మెజారీటీతో గెలిపించుకోవాలని పిలుపు

మెదక్ ప్రతిష్టాత్మక నియోజకవర్గమని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవచ్చని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. మెదక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ( మే 9) నర్సాపూర్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు హాజరుకానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి కొండా సురేఖ గారు పరిశీలించారు. ఏఐసిసి సెక్రటరీ పిసి విష్ణునాథ్, మెదక్ జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కె. సురేష్ తదిరులతో కలిసి హెలిప్యాడ్ ను పరిశీలిస్తూ, సభ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. సభా కార్యక్రమాల్లో ఎలాంటి అసౌకర్యాలు, పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, మెదక్ ప్రతిష్మాత్మక నియోజకవర్గమని, ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ గారు పోటీచేసి గెలిచి, ప్రధానమంత్రి అయిన తర్వాత నెలకొల్పిన ఫ్యాక్టరీలతో ఇక్కడ ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు లభించాయని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గానీ, బిఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. దుబ్బాక నుంచి గెలిచిన రఘునందర్ రావు బిజెపి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తేలేకపోయారని అన్నారు. బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి స్థానికేతరుడని, ఇక్కడి ప్రజలను హింసించి, వారి భూములను ఆక్రమించి, అందులో కేసీఆర్ కు వాటా ఇచ్చిన దోపిడీదారుడని మంత్రి సురేఖ విమర్శించారు. వీరి దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.

.