ఓటమి భయంతో మత వైశామ్యాలు రెచ్చగొడుతున్న మోడీ,బిజెపికి ఓటు వేస్తే హక్కులు కోల్పోయినట్టే,,

భారత్ న్యూస్ హైదరాబాద్….

ఓటమి భయంతో మత వైశామ్యాలు రెచ్చగొడుతున్న మోడీ

బిజెపికి ఓటు వేస్తే హక్కులు కోల్పోయినట్టే

పార్లమెంటు ఎన్నికల్లో ఒకటైన బిఆర్ఎస్, బిజెపి

రైతు భరోసా రాకుండా కుట్ర చేస్తున్న రైతు వ్యతిరేక పార్టీలు బిజెపి, బిఆర్ఎస్

ప్రాణహిత కడతాం ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్ళు ఇస్తాం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు

నిర్మల్ మీడియా సమావేశంలో వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మూడో సారి ప్రధాని అవుతానన్న ఆశలు పోయి ఓటమి భయంతో ప్రధాని మోడీ దేశంలో మత వైశమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి దీపా దాస్ మున్షీ తో కలిసి హాజరయ్యారు. పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ శ్రేణులకు దశా దిశా నిర్దేశం చేశారు. ఈనెల 13న పోలింగ్ జరగడానికి కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించాలని పలు సూచనలు చేసినా అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపికి ఓటు వేస్తే మన హక్కులు పోతాయన్నారు. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ పరిరక్షణకు దేశ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియంతృత్వంతో ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న మోడీ ఒకవైపు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడి దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టాలని ప్రజల కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ మరో వైపు ఈ ఎన్నికల సంగ్రామంలో నిలబడ్డారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జిల్లా రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోడీకి ఈ ఎన్నికల్లో రాజ్యాంగ ప్రేమికులు ప్రజాసామికవాదులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ సంపదను బహుళ జాతి సమస్యలకు దారాదత్తం చేయాలనే దురాలోచనతో మోడీ మూడోసారి ప్రధాని కావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు, దేశ సంపద, రాజ్యాధికారంలో వారికి రావలసిన వాటా తూచా తప్పకుండా అమలు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రుజువైందన్నారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అవుతుందని అన్నారు. పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చి అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు బిఆర్ఎస్ ఎంపీలు మద్దతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బిఆర్ఎస్, బిజెపి లు ఒకరికొకరు గెలిపించుకోవడానికి
ప్రయత్నం చేస్తున్నాయన్నారు. టిఆర్ఎస్ బలమున్నచోట బిజెపి బలహీనమైన అభ్యర్థిని పోటీలో పెట్టగా బిజెపి అభ్యర్థి బలమున్న చోట బిఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థిని పోటీలో నిలిపిందని వివరించారు. దేశ సంపదను సంపన్నులకు వ్యాపారులకు దోచిపెట్టి బిజెపి పార్టీ, రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన బిఆర్ఎస్ పార్టీలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాయని ఈ పార్టీల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుల పట్ల బిజెపి బిఆర్ఎస్ పార్టీలు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాయన్నారు. రైతు భరోసా రాకుండా బిజెపి, బీఆర్ఎస్ లు కలిసి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు భరోసా విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఓబిసి కులగణన ద్వారా దేశ సంపద రాజ్యాధికారంలో జనాభా దమాషా ప్రకారం వారికి వాటా లభిస్తుందని రాహుల్ గాంధీ బిజెపి పాలకులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగలను మొదలుపెట్టామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కూడా కులగరణ కచ్చితంగా చేపట్టి జనాభా దమాష ప్రకారంగా హక్కులు, సంపద కల్పిస్తామని వెల్లడించారు