Headlines

త్రాగునీటిని కలుషితం వద్దండి….

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణలను అరికట్టండి…
(భారత్ న్యూస్ ,;;;మద్దికేర)

ప్రస్తుత విషమ పరిస్థితుల్లో ఒకవైపు బాణుడు ప్రతాపం మరోవైపు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న పట్టించుకునే నాధుడు కరువయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ పోరంబోకు స్థలాలను ఏదేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు మండల కేంద్రమైన మద్దికేర ప్రాంతం లోని మద్దమ్మకుంట కు చేరుకుంటున్న నీరు కలుషితం కావడం అది పశువుల ప్రాణా హానిగా మారుతున్న తీరుందని గ్రామస్తులు వాపోతున్నారు.
కుంటకు పక్కనే త్రాగునీటికి సౌలభ్యంగా ఉన్న ఓ బోరు బావి నీటిని పలువురు (మాంసము విక్రతలు) వ్యాపారులు తమ వ్యాపారంగా బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే బోర్ బావి పక్కన ప్రభుత్వ పోరంబోకు స్థలమును ఆక్రమణలుగా చేసుకుంటూ వ్యాపారాలు సాగిస్తున్నారు దీంతో సదరు బోరు బావి నీరు కలుషితం కానుండడం అధికారులు గుర్తించాల్సింది. ఓవైపు నీరు కలుషితం కావడం మరోవైపు అక్రమ కట్టడాలతో ఆక్రమణలు జరుగుతున్న సంబంధిత అధికారులు తమ విధుల పట్ల భంగాకరంగా నిర్వర్తిస్తూ చోద్యం చూస్తూ ఉండటం గమనార్హం సదర్ ప్రాంతంలో సంబంధిత అధికారులకు పలువురు స్థానికులు ఫిర్యాదులు చేసిన చర్యలు లేకపోవడం పట్ల వారి విధులు ప్రశ్నార్థకంగా మారింది ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టితో సంబంధిత స్థలం ఆక్రమణ సాగిస్తున్న వారిపట్ల విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు న్యాయం కలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.