ఎమ్మెల్యేలుగా,ఎంపీలుగా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులను గెలిపించండి వై.వి.బి రాజేంద్రప్రసాద్ పిలుపు.

భారత్ న్యూస్ గుడివాడ….

ఎమ్మెల్యేలుగా,ఎంపీలుగా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులను గెలిపించండి …. వై.వి.బి రాజేంద్రప్రసాద్ పిలుపు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ గారు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి గుండు శంకర్ కు మద్దతుగా పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి శ్రీకాకుళం పట్టణంలో విస్తృతంగా పర్యటించి గుండు శంకర్ ను గెలిపించాలని పట్టణ ఓటర్లను అభ్యర్థించారు.

అనంతరం గుండు శంకర్ ని కలిసి సత్కరించి అభినందించిన రాజేంద్రప్రసాద్.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు నిధులు,విధులు,అధికారాలు పునరుద్ధరిస్తామని అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు గౌరవ వేతనం పెంచుతామని మేనిఫెస్టోలో పొందుపరిచి స్పష్టమైన హామీ ఇచ్చినందుకు ఎన్డీఏ బలపరిచిన 175 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ,25 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించడానికి రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయవలసినదిగా రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.

\ చంద్రబాబు నాయుడు గారు మా సర్పంచ్ల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ పై నమ్మకం ఉంచి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకరరావుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు కు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ,పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దగ్గుబాటి ప్రసాద్ కి అనంతపూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజేంద్రప్రసాద్ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతేనే గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు మనుగడ ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులకు, ఎంపిటిసి లకు, జడ్పిటిసిలకు కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు నిధులు,విధులు, అధికారాలు మరియు గౌరవం దక్కాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా గ్రామీణ ప్రజలకు అభివృద్ధి మరియు సంక్షేమం అందాలన్నా పట్టణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సర్పంచ్ లు,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయాలని రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ నాయుడు ,పంచాయతీ రాజ్ ఛాంబర్ జిల్లా అధ్యక్షులు భానోజీ నాయుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు రౌతు శ్రీనివాస్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.