26: students of etcherla government high School in BVR Talent Test

ప్రతిభను చాటుకున్న విద్యార్థులు భారత్ న్యూస్
ఎచ్చర్ల ,నవంబర్ 26: జిల్లాస్థాయిలో నిర్వహించిన బివిఆర్ టాలెంట్ టెస్ట్ లో ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఆ పాఠశాల గైడ్ టీచర్ పారుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇరువురి విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. రణస్థలం మండలం జె ఆర్ పురం ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో కొండములగాం చెందిన బి. కిరణ్ ప్రథమ స్థానాన్ని, శ్రీకాకుళం విద్యార్థి యశ్వంత్ ద్వితీయ స్థానాన్ని, ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఐ. హర్షిత్ యాక్స్ తృతీయ స్థానాన్ని సాధించారు. తెలుగు మీడియం టాలెంట్ టెస్ట్ లో పిల్లలకు వలస కు చెందిన వి. తేజేశ్వరి ప్రథమ స్థానాన్ని స్థానాన్ని ,ఎచ్చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పి. సాయికుమార్ ద్వితీయ స్థానాన్ని, డి బొండపల్లికి చెందిన పావని తృతీయ స్థానాన్ని సాధించారు .ఈ మేరకు విద్యార్థులను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణయ్య విజేతలకు నగదు పురస్కారాలను, ప్రశంసా పత్రములను అందించారు. కాగా ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు శ్రీరాములు, గైడ్ టీచర్ ,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఆ పాఠశాల విజేత విద్యార్థులను అభినందించారు.