world genius dr br ambedkar

భారత్ న్యూస్ విజయవాడ,

ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్

విద్యార్థి సంఘం నాయకులు పి.మంజునాథ్

*రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం

*విద్యార్థి దశ నుంచే రాజ్యాంగం పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.

*ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలి.

*ప్రపంచానికే ఆదర్శం భారత రాజ్యాంగం

74వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ మన భారతదేశంలో అత్యంత విలువైన గౌరవప్రదమైన రాజ్యాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో రచించి 1949 నవంబర్ 26న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారికి అప్పగించడం జరిగింది. దానిని రాష్ట్రపతి ఆమోదించి, అప్పటినుంచి ఇప్పటివరకు రాజ్యాంగం ప్రకారం మనం మనకు మనమే పరిపాలించుకోవడం అనేది జరిగింది. ఈ గొప్ప అవకాశాన్ని అంబేద్కర్ గారు చేయడం మనకెంతో గర్వకారణం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంస్కర్తగా, మేధావిగా, భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి మన దేశానికి చేసినటువంటి కృషి చిరస్మరణీయం అని అన్నారు.