దామలచెరువు పంచాయతీలో సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్న పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి

దామలచెరువు పంచాయతీలో సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్న పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి

పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో మూడవ రోజు బందార్లపల్లి లోని సత్యమ్మకు పూజలు నిర్వహించి,మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమం నిర్వహించారు.అనంతరం హరిజనవాడ,ఊటువంక,పచ్చిపాలపల్లి,హరిజనవాడ,మల్లప్పగారిపల్లి,జింకలమిట్ట,గొల్లపల్లి,మబ్బునాయునిపల్లి,కుక్కలపల్లి,హరిజనవాడ గ్రామాలలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి జె.శ్రీమతి ధనలక్ష్మి “బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ”కార్యక్రమంలో శుక్రవారం ఇంటింటికి వెళ్లి స్థానిక నాయకుల సమక్షంలో నిర్వహించారు.ఆమెకు
ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం పలికారు.సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ పులివర్తి నానికి ఒక్క అవకాశం ఇవ్వాలని,వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థించారు.రాష్ట్రం అన్ని విధాల మరింత అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు.మహిళలు,యువకులు,పెద్ద ఎత్తున ఆమె వెంట తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో పాకాల మండల తెలుగుదేశం,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళా నాయకురాలు,తదితరులు పాల్గొన్నారు