టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే, తిరిగి మాపైనే కేసులు పెడతారా?

భారత్ న్యూస్ విజయవాడ…

టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే, తిరిగి మాపైనే కేసులు పెడతారా?

అధికార యంత్రాంగం పై ఈసీకీ ఫిర్యాదు చేస్తా!!

పులివెందుల, కడప రౌడీయిజం తీసుకొచ్చారు!!

గతంలో నా భార్యపై, ప్రస్తుతం నా కోడలిపై దాడికి పాల్పడ్డారు

మీడియా సమావేశంలో “పులివర్తి నాని”

తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే ఆర్వో ఫిర్యాదుతో మాపైనే కేసులు పెట్టారని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. చంద్రగిరిలో కులమతాలకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారు. నామినేషన్ ను 25న దరఖాస్తు చెస్తామని ఆర్డీవో కు ముందుగా చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ల గురించి అడిగితే 24 అని చెప్పారు. మళ్లీ 25 న మేము అనుకున్న సమయాన్నే వాళ్లు అడిగారు. మాకంటే అరగంట ముందు వైసీపీ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. నామినేషన్ రోజు చంద్రగిరి నాగాలమ్మ ఆలయాన్ని వైసీపీ రంగులతో ముంచెత్తారు. నూర్ జంక్షన్ దగ్గర విపరీతమైన శబ్దంతో పార్టీ పాటలతో ఇబ్బంది పెట్టారు. చంద్రగిరి ప్రశాంతంగా ఉండాలని తలొగ్గాం. ఆర్డీవో కార్యాలయం ఎదుట తొండవాడ వైసీపీ సర్పంచ్ కొడుకు టీడీపీ జెండా ను కాళ్లతో తొక్కడం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాపై రాళ్లు దాడి చేశారు. ఆధారాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వాహనాన్ని జెండాలతో కొట్టడం జరిగిందని ఆరోపించారు. నా కోడలు నామినేషన్ సందర్భంగా అక్కడి వస్తే మూకుమ్మడిగా దాడికి యత్నించారు. చిత్తూరు రౌడీయిజం అని అంటున్నారు. చిత్తూరు చాలా ప్రశాంతమైన జిల్లా… పులివెందుల, కడప రౌడీయిజాన్ని తీసుకు వచ్చింది ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? అని పులివర్తి నాని ప్రశ్నించారు.