ఒంగోలు నగరంలో ముస్లీం మైనార్టీల ఆత్మీయ సమావేశం,,,

భారత్ న్యూస్ గుడివాడ.

ముస్లింల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం

ఒంగోలు నగరంలో ముస్లీం మైనార్టీల ఆత్మీయ సమావేశం

పెద్ద ఎత్తున హాజరైన ముస్లీం మైనార్టీలు, టీడీపీ-జనసే నాయకులు, కార్యకర్తలు

వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి ముస్లిం, మైనారిటీలకు జగన్ తీరని ద్రోహం

ముస్లీంలు అంతా ఏకమై సీఎం జగన్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండల స్పీకర్ షేక్ షరీఫ్ గారు,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఏమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారు,పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు,జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, షేక్ మౌలానా గారు, షేక్ రఫి గారు హాజరయ్యారు.

ఈ సందర్బంగా కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి రాష్ట్ర ముస్లిం, మైనార్టీలకు తీరని ద్రోహం చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రూ.కోట్ల ముస్లిం సంక్షేమ నిధులు జగన్‌ సొంత కార్యక్ర మాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తానని చెప్పి, మైనార్టీలను మోసం చేశారన్నారు. కేవలం ఈ ప్రభుత్వం ఆర్భాటాల ప్రభుత్వమని, రాష్ట్రానికి, ముస్లిం, మైనార్టీలకు ఊరగబెట్టింది ఏమీ లేదని, ఈ ప్రభుత్వం ముస్లింల ద్రోహి అని అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ముస్లింలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

ఈ సందర్భంగా షరీఫ్ గారు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి రాష్ట్ర ముస్లిం, మైనారిటీలకు తీరని ద్రోహం చేసిన సిఎం జగన్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దైవదర్శనానికి హజ్‌ యాత్రకు వెళ్లే వారికి హజ్‌ హౌస్‌ ల నిర్మాణం, వారికి సబ్సిడీలు, దుల్హన్‌ పథకం అందిస్తానని వాగ్దానం చేసిన జగన్‌రెడ్డి ముస్లింల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ నక్క వినయాలు వల్లిస్తూ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. పాదయాత్ర సమయంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నొటికొచ్చిన హామీలు ఇచ్చారన్నారు. ముస్లిం ఓటర్లు ఆ మాటలు నమ్మి ఓటేశారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ముస్లింల సంక్షేమాన్ని విస్మ రించారన్నారు. రాష్ట్రంలో 80 మంది ముస్లిం మైనార్టీల కుటుంబాలపై దాడులు జరిగితే, ఆ దాడులు ఎందుకు జరిగాయి అంటూ అడగడానికి సమయంలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే అర్హత కోల్పోయారని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీల అభివద్ధి, సంక్షేమం దష్టిలో ఉంచుకుని మైనార్టీ కార్పొరేషన్‌ నుండి సబ్సిడీ రుణాలు, మహిళలకు కుట్టు మిషన్లు, దుకాన్‌-మకాన్‌ లాంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తింపు తీసుకోచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. ముస్లింల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు.