Headlines

Close down shops not following plastic norms: Commissioner Aditi Singh IAS

ప్లాస్టిక్ నిబందనలు పాటించని షాప్ లను మూయించండి : కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

తిరుపతి ( భారత్ న్యూస్ )
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించని షాపులను మూయించండని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను, కొన్ని ఏరియాల్లో పరిశుధ్యం, కొన్ని దుఖాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. తిరుపతి నగరంలోని 42, 44 మస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను కమిషనర్ పరిశీలించడం జరిగింది. ఫిష్ మార్కెట్ నుండి లీలామహాల్ సర్కిల్, అక్కడి నుండి కపిలతీర్థం వరకు, అక్కడి నుండి అలిపిరి వరకు పరిశిరాలను పరిశీలించారు. స్కావెంజర్స్ కాలనీ వద్ద వున్న జంతు కళేబారాసాలను పరిశీలిస్తూ అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలన్నారు. కపిలతీర్థం రోడ్డులో అలిపిరి పోలిస్టేషన్ ప్రక్కన వున్న కూల్ డ్రింక్ షాప్ లో నిబందనలకు విరుద్దంగా విక్రయిస్తున్న ప్లాస్టిక్ వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ షాపును సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేసారు. అదేవిధంగా కొన్ని షాపుల ముందు గ్లాసులు, చెత్త వ్యర్ధలు వుండడంతో వారి చేతనే వాటిని శుభ్రపరచడం జరిగింది. కొన్ని దుఖాణాలను పరిశీలిస్తూ సింగిల్ యూజ్ నిషేదిత ప్లాస్టిక్ ఉత్పత్తులను అమ్మినా, ఉపయోగించిన జరిమానాలతో బాటు తగు చట్టబద్ద చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచెయ్య పాల్గొన్నారు.