మాకు మాయ మాటలు చెప్పి మా మెడలలో బలవంతంగా జనసేన కండువా కప్పారు,,,

భారత్ న్యూస్ కోడూరు

మాకు మాయ మాటలు చెప్పి మా మెడలలో బలవంతంగా జనసేన కండువా కప్పారు

ఉల్లిపాలెం 9వ వార్డు మెంబర్ సిద్ధినేని సంపూర్ణ మరియు పలువురు వైసిపి కార్యకర్తలు…

మరలా కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కండువా కప్పుకున్న సిద్ధినేని సంపూర్ణ..

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన చెందిన పలువురు వైసిపి నాయకులను కార్యకర్తలను కోడూరు మండలానికి చెందిన జనసేన, తెలుగుదేశం, పార్టీల నాయకులు మాయ మాటలు చెప్పి జనసేన పార్టీ లో బలవంతంగా చేర్పించారని అక్కడికి వెళ్లేంతవరకు మాకు ఆ విషయం తెలియదని ఉల్లిపాలెం 9వ వార్డు మెంబర్ సిద్దినేని సంపూర్ణ తెలిపి మంగళవారం కోడూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు.

ఈ సందర్భంగా కోడూరు మండలం జడ్పిటిసి యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కోడూరు మండలంలోని గాక నియోజకవర్గంలో పలుచోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను కొంతమంది

కూటమికి చెందిన పార్టీ నాయకులు పనిగట్టుకుని వారికి డబ్బు ఇస్తామని, వస్తువులు ఇస్తామని మాయ మాటలు చెబుతూ మభ్యపెడుతు భయపెట్టి జనసేన పార్టీలో చేర్పిస్తున్నారని ఇలాంటి వారు ఎందరు కలిసిన మరలా అవనిగడ్డ నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని యాదవరెడ్డి సత్యనారాయణ అన్నారు.