ఉరవకొండలో క్యాడర్ లేని కాంగ్రెస్ ఇంచార్జ్ అభ్యర్థి

భారత్ న్యూస్ కుదేరు 26/2/2024

ఉరవకొండలో క్యాడర్ లేని కాంగ్రెస్ ఇంచార్జ్ అభ్యర్థి

–ఉరవకొండలో గత ఎన్నికల్లో 1500 ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి
–ఎలక్షన్లో వస్తే మాత్రమే కనిపిస్తా గెలవకపోయినా కాంగ్రెస్లో ఇన్చార్జి మాత్రం నాదే
–కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉంటూ కనీస ఓటు శాతాన్ని సాధించలేని అభ్యర్థి

కూడేరు ఫిబ్రవరి 27 (భారత్ న్యూస్)

ఉరవకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ నుంచి ఇంచార్జ్ అభ్యర్థిగా స్థానికుడే అయిన కనీసం ఓటు శాతాన్ని సాధించలేక పోవడంతో ఉరవకొండ కాంగ్రెస్ లో అసమ్మతి నెలకొంది. 2024 లో జరగబోయే ఎలక్షన్లో మరింత గెలువలేని స్థితిలో గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇతను వ్యాపారం కోసం రామగిరి నుండి కూడేరుకు వలస రావడంతో స్థానికుడే అయిన ప్రజల్లో స్థానికేతడుగా ప్రజల్లో ముద్రపడడంతో ఓటమి కి ముందంజలో నిలుస్తున్నట్లు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కానీ ఇతనికి ప్రజలలో గుర్తింపు లేకపోవడం ఇతను ఓటమికి ఇతనే నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మాత్రం ప్రజల్లో కనిపించడం గమనార్హం…! అయినప్పటికీ ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఇన్చార్జి ఉంటూ పార్టీలో గెలవలేని స్థితిలోకి పడిపోయాడు. కనీసం పార్టీలో క్యాడర్ లేని వారందరికీ టికెట్లు కేటాయించడంతో కాంగ్రెస్ మరింత గెలవలేని స్థితిలో పడిపోయింది. అంతేకాకుండా గత ఎలక్షన్లలో ఉరవకొండలో కాంగ్రెస్ తరపున మేము గెలుస్తాం , మేము విజయం సాధిస్తాం, అని చెప్పిన ఇన్చార్జి కి కేవలం 1500 ఓట్లకు పరిమిత కావడంతో కనీసం వార్డ్ మెంబర్ కైనా గెలవగలడాని పలువురు మేధావులు ప్రజల అభిప్రాయపడుతున్నారు. అలాంటివారికి ఉరవకొండ నియోజకవర్గం లో పార్టీ ఫండ్ కోసమే కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉంటున్నారనే పలు అనునామాలు సందేహాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఇన్చార్జ్ అభ్యర్థిగా ఇవ్వడంతో కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు.ఎలక్షన్లు వస్తున్నాయంటే మాత్రం ప్రజల్లో కనబడడంతో పలు సందేహాలు వ్యక్తం అవున్నాయి . ఈయన ఎలక్షన్స్ వస్తున్నాయంటే మాత్రం హడావుడిగా కాంగ్రెస్లో విజయాన్ని సాధిస్తామని ధీమాగా మాట్లాడడం తెలుసు కానీ ఖర్చు మాత్రం శూన్యం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతో ఇంతో పార్టీ పండ్ కేటాయిస్తే ఆ పార్టీ పండ్ తీసుకుని ప్రజలకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజలను గాలికి వదిలేసే పరిస్థితి ఎన్నో ఉన్నాయని అలాంటివారికి ఉరవకొండ కాంగ్రెస్ టికెట్ కేటాయించడం చాలా బాధాకరమని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలలో బలం లేని , క్యాడర్ లేని, వ్యక్తికి ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఇన్చార్జివ్వడంతో కనీసం ఈసారి 2000 ఓటు అయినా సాధించగలడాని….! ప్రజల అభిప్రాయపడుతున్నారు. ఉరవకొండ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు బలంగా ఉండడంతో ఉరవకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంచార్జ్ అభ్యర్థిగా డిపాజిట్ నైనా దక్కించుకోగలరని ప్రజల అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్లో కనీసం గెలుపు కోసం కృషి చేయని ఇలాంటి నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడం తో ప్రజల అయోమయ స్థితిలో పడిపోయారు. ఏది ఏమైనా ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడే వారికి కాంగ్రెస్ ఇన్చార్జిగా అభ్యర్థిగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని లేకుంటే ఉరవకొండలో కాంగ్రెస్ పరిస్థితి మరింత గడ్డుకాలం ఏర్పడే పరిస్థితులు అధికంగా ఉన్నాయని ప్రజల అభిప్రాయపడుతున్నారు.