నేర చేదన లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలినేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేట్ పెంచాలి

….Bharathnews.hyd,,

రామగుండము పోలీస్ కమీషనరేట్


నేర చేదన లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేట్ పెంచాలి

నేర నిరూపనకు సాక్షాదారాలను పకడ్బందీగా సేకరించి నేరస్థులకు శిక్ష పడేలా చేయాలి, ప్రతి కేసుపై పై అదికారుల పర్యవేక్షణ ఉండాలి

సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రియ పరిశోధనతో సమగ్ర విచారణ చేపట్టి నేరాల నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి అని అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజీ) గారు సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోనీ డీసీపీ లు, ఏసీపీ లు, సీఐ, పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అధికారులతో కమీషనరెట్ లో UI కేసులు, గ్రేవ్ UI లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం, SC/ST UI కేసులు, విమెన్ ఎగైనెస్ట్ కేసులు, POCSO కేసుల పరిష్కారం, NDPS యాక్ట్ కేసుల, NHRC, SHRC మరియు మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై సమీక్షా నిర్వహించడం జరిగింది.

ఈసందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ….. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులోఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రియ ఆధారాలతో దర్యాప్తు చేయాలి తద్వారా చట్టపరిధిలో నిందితులకి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని అన్నారు.

 సాంకేతిక పరిజ్ఞానం పై, ఫోరెన్సిక్ సైన్స్ పై, శాస్త్రీయ ఆధారాల పై మరియు కేసుపై సమగ్రమైన పూర్తి పట్టు సాధించి తద్వారా నేర పరిశోధనలు చేయాలి.ఇన్వెస్టిగేషన్ లో అలసత్వం ప్రదర్శించకూడదు. పరదర్శకంగా విచారణ చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలి. సమయానుకూలంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రొయాక్టీవ్ పోలీసింగ్ తో విధులు నిర్వహించాలన్నారు.

 ఎన్నికల సమయంలో నమోదైన కేసులు పూర్తి చేయాలన్నారు

 ఇతర జిల్లాల, రాష్ట్రాల సంబందించిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారిని పట్టుకొని NBWs లను ఎజ్జిక్యూట్ చేయాలి

 అదేవిధంగా రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలొ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలి.

 పిడిఎస్ రైస్ ,ఐడి లిక్కర్ ,గంజాయి , ఇతర ఆర్గనైసేడ్ క్రైమ్ లపై, చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. పోలీస్ స్టేషన్ ల వారిగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, అమ్మేవారు, తాగే వారి జాబితా, గుడుంబా తయారు చేసేవారు, అమ్మే వారి, గుడుంబా తయారికి వాడె బెల్లం అమ్మేవారి, రవాణా చేసే వారి జాబితా సిద్దం చేసుకోవాలన్నారు.

 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పటికపుడు SHO లు ఏం జరుగుతుంది అనే సమాచారం వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారా మార్గం తెలిసి ఉండాలి సరైన సూచనలు ఇస్తూ వారికి చేయు విధులపై సరైన అవగాహన చేస్తూ, ఎం చేయాలో క్లుప్తంగా తెలిసేలా చూడాలి. ప్రతి ఒక్కరు తాము చేసే విధులపై పూర్తి అవగాహన కలిగి యుండాలి అని అధికారులకు సూచించారు.

 ఏదైనా సంఘటన జరిగినప్పుడు వేంటనే ఘటన స్థలంకి వెంటనే వెళ్ళాలి. పరిస్థితి లు అదుపులో ఉండేలాగా చూడాలి.

 సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా మరియు వారినీ, బాడిలీ ఆఫెండర్స్ ను, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు.

 సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా, పోల్టికల్ వైలెన్స్, దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియో లు వైరల్ చేసే విషయాలు, అసత్య ప్రచారాలు, వ్యక్తిగత మైన, మతపరమైన విద్వేషాలు కలిగించి, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే విధంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడితే చట్టపరమైన కఠిన పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 నేర విచారణ అధికారి కేసులలో శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, ప్రతి దరఖాస్తులో పారదర్శకంగా ఎంక్వైరీ చేసి అట్టి రిపోర్టును CCTNS ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.

 ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలి. కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా నేర సంఘటన లో జరిగిన నిజం చెప్పే లాగా సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు.

 ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, రాత్రి ప…