ఎన్నికలకు సంసిద్ధంగా ఉండండి.. జాయింట్ కలెక్టర్..

భారత్ న్యూస్:
ఎన్నికలకు సంసిద్ధంగా ఉండండి.. జాయింట్ కలెక్టర్..

కూడేరు, మార్చి 28 (భారత్ న్యూస్) స్థానిక మండల తాసిల్దార్ కార్యాలయము నందు గురువారం ఎన్నికల సంసిద్ధతపై కూడేరు మండల సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో జెసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెక్టర్ ఆఫీసర్లకు రూట్ ఆఫీసర్లకు వారి వారి పోలింగ్ బూత్ లపై, రూట్ మ్యాప్ లపై ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం కూడేరు మండలంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి చెక్పోస్ట్ ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కూడేరు, ఉరవకొండ, విడపనకల్, బెలుగుప్ప, వజ్రకరూరు, తహసిల్దార్లు ఎంపీడీవోలు, కూడేరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ శివశంకర్ మండల సెక్టార్ అధికారులు రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.