బేతంచెర్ల – బుగ్గనిపల్లి మధ్య విద్యుద్దీకరణతో పాటు రెండవ లైన్ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

భారత్ న్యూస్ విజయవాడ…

బేతంచెర్ల – బుగ్గనిపల్లి మధ్య విద్యుద్దీకరణతో పాటు రెండవ లైన్ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
• ఈ ప్రాజెక్ట్‌ గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్ & విద్యుద్దీకరణలో భాగం
• దీనితో, గుంతకల్లు – బుగ్గనిపల్లి మధ్య 113 కిలోమీటర్ల నిరంతర డబుల్ లైన్ అందుబాటు.

ప్రస్తుతం కొనసాగుతున్న గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టు పై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది మరియు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలలో డబుల్ లైన్ పూర్తయింది. అదే ఓరవడిని కొనసాగిస్తూ బేతంచెర్ల-బుగ్గనపల్లి సిమెంట్ నగర్ మధ్య మరో 6.2 కిలోమీటర్ల మేర సెక్షన్‌ను విద్యుద్దీకరణతో పాటు డబుల్ లైన్ పనులు పూర్తి చేసి ప్రారంభించింది. ఈ విభాగం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు & నంద్యాల జిల్లాల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ సెక్షన్‌ను డబ్లింగ్ చేయడంతో, గుంతకల్లు-బుగ్గనపల్లి మధ్య 113 కిలోమీటర్ల వరకు విద్యుదీకరణతో పాటు నిరంతర డబుల్ లైన్ సౌకర్యం ఉంటుంది .
గుంటూరు–గుంతకల్లు సెక్షన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరాన్ని రాయలసీమ ప్రాంతంతో మరియు దక్షిణాది రాష్ట్రాలలోని ఆపైన ప్రాంతాన్ని అనుసంధానించే కీలకమైన రైలు మార్గం. ఈ లైన్ గుంటూరు, ప్రకాశం , పల్నాడు,నంద్యాల మరియు కర్నూలు జిల్లాలలోని మారుమూల ప్రాంతాలను కలుపుతుంది. నిరంత రవాణాను అందించడానికి మరియు ఈ విభాగంలో రద్దీని తగ్గించడానికి, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్& విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ 2016-17సంవత్సరంలో సుమారు రూ.3887కోట్ల అంచనా వ్యయంతో 401కిలోమీటర్ల దూరం కోసం మంజూరు చేయబడింది.

ఇప్పటివరకు, నల్లపాడు – గిద్దలూరు మధ్య 200 కిలోమీటర్లు మేర మరియు బేతంచెర్ల – గుంతకల్లు మధ్య 107 కిలోమీటర్లు మేర డబ్లింగ్ & విద్యుద్దీకరణ తో మొత్తం 307 కి.మీ ప్రాజెక్ట్ పూర్తయి ప్రారంభించబడింది. ఇప్పుడు బేతంచెర్ల – బుగ్గనపల్లి మధ్య మరో 6 కిలోమీటర్ల మేర పనులు పూర్తికావడంతో గుంటూరు-గుంతకల్లు లోని వివిధ విభాగాలలో మొత్తం 313 కిలోమీటర్ల మేర రెండవ లైన్‌తో పాటు విద్యుద్దీకరణ పూర్తి అయినది.
ముఖ్యముగా గుంటూరు- గిద్దలూరు మధ్య 200 కిలోమీటర్లు మరియు బుగ్గనపల్లి- గుంతకల్లు మధ్య 113 కిలోమీటర్లు నిరంతరాయంగా రైళ్లు నడపబడతాయి ఈ విభాగాలను డబ్లింగ్ చేయడం వల్ల కీలకమైన ఈ విభాగంలో రద్దీ తగ్గుతుంది, తద్వారా గుంటూరు- గుంతకల్లు సెక్షన్‌లో రైళ్ల నిర్వహణలో మంచి వెసులుబాటు లభిస్తుంది. ప్రాజెక్టు లోని మిగతా సెక్షన్‌ అనగా బుగ్గనపల్లి -గిద్దలూరు మధ్య పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను డబ్లింగ్& విద్యుద్దీకరణ పూర్తి చేయడం వల్ల సెక్షన్‌లో రద్దీ తగ్గడమే కాకుండా రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది.