తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కోడూరు మండల తెలుగుదేశం పార్టీ

భారత్ న్యూస్ కోడూరు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కోడూరు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జడ్పిటిసి సభ్యుడు బండే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వ భౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండే శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజల కనీస అవసరాలు అయినా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా పేదల ప్రక్షాన నిలబడి పోరాటాలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని దేశ రాజకీయ పార్టీలోనే గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అనంతరం కార్యకర్తలు నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గోగినేని సోమశేఖర రావు ,పిల్లి మల్లికార్జునరావు తోట రాంబాబు ,కడవకొల్లు నాంచారయ్య, ఉప్పాల పోతురాజు ,పూత బోయిన శ్రీనివాసరావు ,గోలి సాంబశివరావు ,వేములపల్లి రాజేష్ ,ఎలవర్తి వెంకటేశ్వరరావు, కాగిత ప్రసాద్ ,అప్పికట్ల రవీంద్రబాబు ,కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, పాశం పాండురంగారావు, బొలిశెట్టి విట్టల్ రావు, సింగం బాపచ్చ, మహమ్మద్ ఇమ్రాన్, బం డే వెంకటేశ్వరరావు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు.