శ్రీనివాసపురం, పద్మావతిపురం పంచాయతీలలో తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ,,

భారత్ న్యూస్ విజయవాడ…

శ్రీనివాసపురం, పద్మావతిపురం పంచాయతీలలో తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ

మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరిక

తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురం పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆదివారం వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పార్టీలో చేరిన వారిలో వైసిపి మాజీ మండల పార్టీ అధ్యక్షురాలు ఆదిలక్ష్మీ, వార్డ్ మెంబర్స్ పుష్పాలత, గంగులమ్మ, ప్రభావతి, మహేశ్వరి నాయకులు రమేష్, శ్రీనివాస్ పద్మావతిపురం పంచాయతీకి చెందిన పి.రమేష్ బాబు ఎక్స్ టి టి డి, నరసయ్య, కౌశిక్, విష్ణు, హేమంత్, మహేష్, హరి, ధీరజ్, మాదేశ్, జానకిరామ్, తేజ, వెంకటేశ్వరరావు, శుక్కన్య, లీల ప్రసాద్, మహేష్, శ్రీనివాసులు, వెంకటేష్, రేవంత్, మాజీ వీఆర్ఓ వెంకట్ స్వామి, రమణ, చంద్రన్న తదితరులు ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం పంచాయితీలను విడగొట్టి సర్వనాశనం చేశారని కొత్తగా పార్టీలో చేరిన వారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మా సొంత భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పులివర్తి నానితోనే చంద్రగిరి అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరడమైందన్నారు. పంచాయితీలో భారీ మెజారిటీ తీసుకువస్తామని పార్టీలో చేరినవారన్నారు.