Minister Jupalli Krishna Rao assured to take steps to solve the problems of Gita professionals.

…Bharathnews.hyd,,,,

గీత వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ.

తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి రక్షణ వృత్తిదారుల సంక్షేమం కొరకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావుకు గీత పనివారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ నేతృత్వంలో డిజీ సాయిల్ గౌడ్, బొమ్మగాని నాగభూషణం, మారగోని ప్రవీణ్ కుమార్, తిగుళ్ల యాదయ్య గౌడ్, డిజి రాజు, నాగమణితో కూడిన ప్రతినిధి వర్గం విజ్ఞప్తి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా సహకార సంఘాల లైసెన్సులు, కొత్త గుర్తింపు కార్డులు, వన పెంపకానికి 10 ఎకరాల ప్రభుత్వ భూమి అన్ని సొసైటీలకు ఇవ్వాలని కోరారు. ఎక్స్ గ్రేషియా పది లక్షల పెంచాలని, మెడికల్ బోర్డు విధానం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి ఆధునీకరణకు వృత్తిదారులకు మొఫడ్స్ షాపుల నిర్మాణానికి భూమి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో వృత్తిదారుల లైసెన్సులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గీత పని వాళ్ళ సంఘం సమర్పించిన మెమరాండం అంశాలను పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ శ్రీ ఎబికే శాస్త్రికి సమస్యలు పై విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు.