The problems of the education sector in the state should be solved

..Bharathnews.hyd,,,,,

రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి.

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

మంగళవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి “బుర్ర వెంకటేశం” గారిని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసి విద్యారంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది

ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలు నిలయంగా ఉన్నాయని అనేక పాఠశాల, కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాలలు , కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,లెక్చరర్ భర్తీ చేయాలని ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థుల చదువులకి ఇబ్బందులు కలుగుతూ విద్యా ప్రమాణాలు పెరగడం లేదని, ఎంఈఓ, డీఈవోలు కూడా ఇంఛార్జి లు ఉండటం వల్ల ప్రభుత్వ విద్య మెరుగుపడటం లేదని, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవని రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టల్స్ అద్దె భవనల్లో కొనసాగుతున్నాయని మెస్ ఛార్జీలు పెరగకపోవడం మూలంగా అనేక హాస్టల్స్ కాంట్రాక్టర్లు నాసికరమైన ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారని దీనివల్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని మరో రెండు నెలలు విద్యాసంవత్సరం పూర్తి కానుంది పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు అధికంగా ప్రయాణించడం కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల కళాశాలలకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని,
కోరడం జరిగింది.

👉 హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు జనవరి 6వ తేదీన పాఠశాలలో విరుద్ధంగా ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించారని, పాఠశాలలో విద్యా ,వైజ్ఞానిక ,శాస్త్రీయ, సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించకుండా రాజకీయ లబ్ధి కొరకు, రాజకీయ ఎదుగుదల కొరకు మతపరమైన కార్యక్రమం నిర్వహించారని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించకుండా మతపరమైన కార్యక్రమం నిర్వహించడం ఎంటనీ?అనేక వేదికలు ఉన్నాయని కానీ పాఠశాలలో పీఠాధిపతులతో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని , ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేయడం జరిగింది.