భారత్ న్యూస్ ఖమ్మం.నల్లమలలో కనువిందు చేసిన పులులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు కనువిందు చేశాయి. శనివారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడం, అవి స్వేచ్ఛగా తిరగడం పట్ల అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
