భారత్ న్యూస్ హైదరాబాద్…పెద్ది’ వివాదం.. గిరిజనుల నిరసన!*
హీరో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలోని ఓ సంభాషణ గిరిజన జాతిని కించపరిచేలా ఉందని విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు.
‘కొండనా కొడకా’ అనే పదం అభ్యంతరకరమని, ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి విరుద్ధమని వారు ఆరోపించారు.

ఈ అసభ్య పదజాలాన్ని వెంటనే తొలగించాలని.. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు డిమాండ్ చేశారు. సెన్సార్ బోర్డు తీరుపై కూడా వారు అసహనం వ్యక్తం చేశారు.