భారత్ న్యూస్ హైదరాబాద్…పెద్ది టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్
పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయంపై తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
జీవో 151 నిబంధనలను పాటించకుండా ఈ నెల 2న టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేశారని పిటిషనర్ ఆరోపించారు.
టికెట్ ధరల పెంపు జీవో చట్టబద్ధతపై విచారణ చేపట్టిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది..
