భారత్ న్యూస్ ఖమ్మం…..కాస్తులో ఉన్నవారికే పట్టాలు.. సాదాబైనామా ల్యాండ్స్ క్రమబద్ధీకరణకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి కీలక ప్రకటన..
తెలంగాణలో సాగులో ఉన్న భూములకు పాసుపుస్తకాలు లేని రైతుల కోసం 70 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి అంగుళాన్ని సర్వే చేసి పట్టాలు ఇస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కాకరవాయిలో పైలట్ సర్వే విజయవంతమైందని తెలిపారు. ధరణి నిషేధిత జాబితా నుంచి పట్టా భూముల తొలగింపు పూర్తయిందన్నారు. పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు గాను ఇప్పటికే 5.30 లక్షల మందికి నోటీసులిచ్చామని మిగిలిన వారికి 15 రోజుల్లో నోటీసులిచ్చి నెలకు పైగా గడువు తర్వాత అర్హులకు క్రమబద్ధీకరణ చేస్తామని వెల్లడించారు.
