కన్న కొడుకే ఆమె పాలిట యముడు అయ్యాడుచివరకు కటకటాల పాలయ్యాడు

భారత్ న్యూస్ విజయవాడ…తిరువూరు నియోజకవర్గం :

కన్న కొడుకే ఆమె పాలిట యముడు అయ్యాడు
చివరకు కటకటాల పాలయ్యాడు

ఈ నేపథ్యంలో పోలీసులు హత్య చేయడం అతను పాత్ర పై స్పష్టమైన ఆధారాలు సేకరించి అనంతరం నిందితుడిని పదవ తారీఖున ఉదయం 10 గంటలకు విసిన్నపేట రెడ్డిగూడెం రోడ్ లోని ఆర్సిఎం చర్చి సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించుగా నేరాన్ని అంగీకరిస్తూ స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చాడు…

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట లో ఈ నెల 6వ తారీకు న జరిగిన మహిళా హత్య గురించి తెలిసిందే ఈ హత్య నిమిత్తం విస్సన్నపేట పోలీస్స్టేషన్ లో Ci గిరిబాబు మరియు si అర్జున్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు… Ci గిరిబాబు తెలిపిన వివరాలు ప్రకారం ::::::::

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట చింతకుంట ఎరియా లో చింతకాయల రమాదేవి తన నివాసం లో మెడ మీద మరియు ఛాతి మీద గాయలతో మృతి చెందినట్లు పిర్యాదు రావడం తో దర్యాప్తు చేపట్టారు….

ఈ దర్యాప్తు లో భాగంగా మృతిరాలి చిన్న కుమారుడు చింతకాయల రఘవంశీ ప్రవర్తన మీద అనుమానం రావడం తో అతని పై నిఘా పెట్టడం సాంకేతిక ఆధారాలు సాక్షులు వాంగ్మూలాలు మరియు విచారణలో వచ్చిన సమాచారంతో మృతురాలి చిన్న కుమారుడే హత్య చేసినట్లు నిర్ధారణ…

చింతకాయల రఘువంశీ S/o వేణుగోపాల్ వయసు 25 సంవత్సరాలు మోటార్ మెకానిక్ గా పని చేస్తూ హైదరాబాదులో నివసిస్తున్నాడు…

కొంతకాలం క్రితం ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో కుటుంబానికి సుమారు 50000 నష్టం పరిహారం చెల్లించడానికి అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మాలని తరచూ ఒత్తిడి చేసేవాడు..

అదేవిధంగా రఘువంశీ తల్లి రఘువంశీ కీ హెచ్ఐవి వ్యాధి ఉన్నదని చుట్టుపక్కల వారికి చెప్పడం దానితో రఘువంశీ మనోవేదనకు గురవడం తరచూ వారిద్దరి మధ్య విభేదాలు రావడం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నిందితుడు తన తల్లిని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు..

06/06/ 2026వ తేదీన హైదరాబాదు నుండి తన మోటార్ సైకిల్ పై విస్సన్నపేట ఇంటికి వచ్చి 07/06/2026 తేదీ తెల్లవారుజామున ఇద్దరికీ వాగ్వాదం జరిగిన అనంతరం తల్లి రమాదేవి గొంతుని చేతులతో బలంగా పిసికి హత్య చేశాడు..