సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

భారత్ న్యూస్ వరంగల్ …సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

తెలంగాణ :

కాంగ్రెస్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులు పటిష్టంగా నిలబడ్డాయని, కానీ బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన జాకోరా, చందూర్‌ ఎత్తిపోతలను ప్రారంభించి, సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలించారు.

సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తామని, నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని, కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.