భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో ఇక ‘నో ఫ్రెండ్లీ పోలీసింగ్’ : డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణలో ఇకపై స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు స్వస్తి పలుకుతున్నామని, ప్రజలను గౌరవిస్తామని, కానీ రౌడీలు, గుండాలను మాత్రం సహించబోమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తెలంగాణలో మావోయిజం అంతమైందని, గ్రేహౌండ్స్ విభాగాన్ని తీసివేస్తున్నామని, 1700 మందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నామని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని, సైబర్ క్రైమ్ తమకు పెద్ద సవాల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఆదిలాబాద్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.