ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ గుంటూరు…ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: కనపర్తి శ్రీనివాసరావు

చల్లపల్లి/ఘంటసాల: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి నెల రెండవ బుధవారం నిర్వహించాల్సిన మండల స్థాయి పార్టీ సమీక్షా సమావేశాల్లో భాగంగా చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా (S.I.R) సవరణ ప్రక్రియపై క్లస్టర్, యూనిట్ కన్వీనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా మార్పులు, చేర్పులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేసేందుకు, నేడు నిర్వహించిన సమావేశాల పూర్తి వివరాలను, ఫోటోలను MY TDP యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఐటీ కో-ఆర్డినేటర్లకు మరియు నాయకులకు స్పష్టం చేశారు.