భారత్ న్యూస్ వరంగల్…బోనస్ ఇక బోగస్..!!
ఇకపై 7 రకాల వడ్లకే బోనస్ చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం
గతంలో ఇస్తున్న 33 రకాల నుండి 26 రకాలు తొలగింపు
2023 ఎన్నికల ముందు పండించిన ప్రతీ పంటకు బోనస్ ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దాన్ని కేవలం సన్న వడ్లకే పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
అయితే ఇప్పటివరకు 33 రకాల వడ్లకు నామమాత్రంగా బోనస్ చెల్లిస్తుండగా, ఇప్పుడు కేవలం బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా. జై శ్రీరామ్, కేఎ న్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ది), కేఎన్ఎం-7715 లాంటి 7 రకాల వడ్లకే బోనస్ చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం

అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో దశాబ్దాలుగా చిట్టి ముత్యాలు అనే వరి రకంతో పాటు, కావేరి, జెయింట్ బీపీటీ, నెల్లూరు సన్నాలు లాంటి వడ్ల రకాలు పండించే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు