భారత్ న్యూస్ హైదరాబాద్.తెలంగాణలో భారీ పెన్షన్ వెరిఫికేషన్!
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరిశీలనలో అర్హత లేని లబ్ధిదారుల పేర్లను తొలగిస్తూ మొత్తం 1.28 లక్షల పెన్షన్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
📌 రద్దైన పెన్షన్లలో:
✅ మృతుల పేర్లు
✅ వలస వెళ్లినవారు
✅ ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్
✅ 5 ఎకరాలకు పైగా భూమి కలిగినవారు
✅ ట్యాక్స్ పేయర్స్

🏡 గ్రామీణ ప్రాంతాల్లో: 1.02 లక్షలు
🏙️ మున్సిపాలిటీల్లో: సుమారు 26 వేల
అదే సమయంలో సామాజిక భద్రత పథకాల కింద కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ 48 వేల మంది వికలాంగులు, వితంతువుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
📢 అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది.