ఆంధ్రప్రదేశ్ : వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ : వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. అమరావతి సచివాలయం, అసెంబ్లీ, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్ణయించింది.

గతంలో ఇచ్చిన ఈ వెసులుబాటును మరో ఏడాది పాటు, అంటే 2027 జూన్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఉద్యోగులు శని, ఆదివారాలు సెలవుగా పాటించవచ్చు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.