భారత్ న్యూస్ రాజమండ్రి…టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా!
భారత మహిళా క్రికెట్ స్టార్ Smriti Mandhana మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక Time Magazine విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు. అథ్లెట్లు, కోచ్‌లు, ఇన్వెస్టర్లతో కూడిన ఈ జాబితాలో ఆమె ఎంపిక కావడం భారత క్రికెట్‌కు గర్వకారణం. కాగా LeBron James, Lionel Messi వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు.
