భారత్ న్యూస్ విజయవాడ…E20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ తిరస్కరణ?
ప్రకటన చేసి మళ్లీ వెనక్కి తీసుకున్న ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ
2023కి ముందు ఉన్న వాహనాల్లో E20 పెట్రోల్ వాడడం నిర్లక్ష్యం కింద పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని, బీమా తిరస్కరిస్తామని ప్రకటించిన ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ
ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రకటన వెనక్కి తీసుకున్న ఐసీఐసీఐ లాంబార్డ్
ఇంజన్లోకి నీరు చేరడం,ఆయిల్ లీక్ అవ్వడం లాంటి వాటికి బీమా వర్తిస్తుందని,కానీ ఇంధనం కారణంగా దెబ్బతింటే బీమా వర్తించదని ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ ప్రకటించడం గమనార్హం

అయితే E20 వాడడం వల్ల సుదీర్ఘకాలంలో ఇంజన్ వైఫల్యం వస్తే, ఇంజన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ తీసుకున్నా ఉపయోగం లేదని ప్రకటించడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులు…