జులై 3వ వారంలో తల్లికి వందనం.. మంత్రితో అధికారులు

భారత్ న్యూస్ విజయవాడ…జులై 3వ వారంలో తల్లికి వందనం.. మంత్రితో అధికారులు

AP: ‘తల్లికి వందనం’ పథకంపై అప్డేట్ వచ్చింది. ఇవాళ మంత్రి లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.