భారత్ న్యూస్ విశాఖపట్నం..మృత్యు కౌగిలిలో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు
అరకొర వైద్యం – పోషకాహార లోపం – మూఢనమ్మకాల ప్రభావం
ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ టీ. కామేశ్వరరావు మరియు జన విజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం కో-కన్వీనర్ డాక్టర్ ఎం. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మరియు కురుపాం మండలాల వివిధ గ్రామాల్లో పరిశీలన నిర్వహించారు.
ఈ బృందంలో యుటిఎఫ్ నాయకులు కూర్మారావు, జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా నాయకులు ప్రసాద్, డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు బాలు, నాని తదితరులు పాల్గొన్నారు.
గత నాలుగు వారాల వ్యవధిలో గిరిజన ప్రాంతాల్లో 16 ఏళ్లలోపు నలుగురు విద్యార్థులు మృతి చెందడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించిన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

మరణించిన విద్యార్థుల వివరాలు:
- గుమ్మడాల అఖిల్ (7వ తరగతి, G.T.W.H.S దుడ్డుకళ్ళు)
స్వగ్రామం: విశ్వనాధపురం
మరణం: ఏప్రిల్ 29 - ఆసిరయ్య (9వ తరగతి, G.T.W.H.S దొరజమ్ము)
స్వగ్రామం: పాములు గీశాడ
మరణం: మే 8 - సుస్మిత (6వ తరగతి, K.G.B.V గుమ్మలక్ష్మీపురం)
స్వగ్రామం: మూలిగూడ
మరణం: మే 17 - బిడ్డిక రాహుల్ (4వ తరగతి, G.T.W.H.S నీలకంఠాపురం)
స్వగ్రామం: నేరుడు మానుకొండ
మరణం: ఏప్రిల్ నెలలో
ప్రధాన కారణాలుగా గుర్తించిన అంశాలు:
- సమయానికి వైద్య సేవలు అందకపోవడం
- గ్రామాల నుండి ఆసుపత్రులు చాలా దూరంగా ఉండటం
- జ్వరం, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించకపోవడం
- పోషకాహార లోపం
- ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం
- వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరగడం
- తల్లిదండ్రుల్లో వైద్య అవగాహన కొరత
- అత్యవసర అంబులెన్స్ సేవలు ఆలస్యంగా చేరడం
విద్యార్థుల �