ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు SBI విజ్ఞప్తి

భారత్ న్యూస్ రాజమండ్రి…ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు SBI విజ్ఞప్తి

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మె నిర్వహించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఎస్‌బీఐ విజ్ఞప్తి చేసింది.

బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయంగా ఏటీఎం, కస్టమర్ సర్వీస్ పాయింట్లు, యోనో, యూపీఐ వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని సూచించింది.