క్షమాపణలు చెప్పిన కమెడియన్ అలీ….

భారత్ న్యూస్ హైదరాబాద్…క్షమాపణలు చెప్పిన కమెడియన్ అలీ….

ఓ యాడ్లో భాగంగా కమెడియన్ అలీ సబ్బుకు పూజ చేయడం వివాదానికి దారితీసింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను కించపరిచేలా ఈ దృశ్యాలు ఉన్నాయని విమర్శలు రావడంతో అలీ స్పందించారు. స్క్రిప్ట్ ప్రకారమే తాను నటించానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వీడియోను డిలీట్ చేయించానని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు..