నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారనే కేసులోనే ఈ అరెస్ట్ వారెంట్ జారీ

2019లో దిలీప్ కుమార్ అనే లాయర్ ప్రకాష్‌రాజ్‌కు ఒకే టైంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఫిర్యాదు

కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశ్ రాజ్‌కు ఓటు హక్కు ఉందని బెంగళూరు హలసూరు గేటు పీఎస్‌లో ఫిర్యాదు

ఈ అంశంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన రాని వైనం

దీంతో ఆ న్యాయవాది కోర్టుని ఆశ్రయించగా.. విచారణకు హాజరు కావాలంటూ పలుసార్లు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాష్‌రాజ్ విచారణలకు గైర్హాజరవుతూ కావడంతో.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు