తెలంగాణ :
భారత్ న్యూస్ హైదరాబాద్ …’ప్రమాద జీవిత బీమా’ పథకం.. తాత్కాలిక ఉద్యోగులకూ వర్తింపు!
తెలంగాణ :

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థిక భరోసా కల్పించేలా ప్రవేశపెట్టిన ‘ప్రమాద జీవిత బీమా’ పథకాన్ని గురువారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
ఏదైనా ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే, పథకం కింద అతని కుటుంబానికి సుమారు రూ.1 కోటి వరకు పరిహారం అందుతుంది.
ఈ పథకం ప్రభుత్వ (రెగ్యులర్) ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులతో పాటు బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ వేతనం అందుకునే ఉద్యోగులందరికీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది
