ఏటీఎం వ్యాన్ డ్రైవర్ చోరీ.. రూ. 17 లక్షలతో పరార్…..

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఏటీఎం వ్యాన్ డ్రైవర్ చోరీ.. రూ. 17 లక్షలతో పరార్…..

హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ రెయిన్ బజార్ – సంతోష్ నగర్ రహదారిపై రూ.17 లక్షల నగదుతో కూడిన ట్రంక్ బాక్స్ నుంచి డబ్బులు దొంగిలించబడిన సంచలన ఘటన చోటుచేసుకుంది.

పక్కా ప్రణాళికతో, దొంగలు డబ్బును తీసుకున్న వెంటనే బైక్‌పై పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

పోలీసులు కేసు నమోదు చేసి, చోరీకి పాల్పడిన డ్రైవర్ మరియు సహకరించిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు…