నకిలీ పత్రాలతో భూకబ్జా.. పాత నేరస్థుడు అరెస్ట్…

భారత్ న్యూస్ హైదరాబాద్ …నకిలీ పత్రాలతో భూకబ్జా.. పాత నేరస్థుడు అరెస్ట్…

హైదరాబాద్‌లో నకిలీ పత్రాలతో భూకబ్జాలు, ఫోర్జరీ, వసూళ్లకు పాల్పడుతున్న పాత నేరస్థుడు మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ (61)ను మంగళవారం చాదర్‌ఘాట్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. నకిలీ ‘హిబానామా’ పత్రాలతో ఆస్తి యజమానులను బెదిరించి రూ. 40 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిపై 9 కేసులు ఉండగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు….