భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కీలక ముందడుగు!
కేంద్రంతో జరిగిన చర్చలు ఫలించాయి. మెట్రో ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్గా #SBICAPS ను నియమించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ ఉండనుంది.
రుణ సేకరణ, నిర్మాణ వ్యయం, విస్తరణ ప్రణాళికలపై SBICAPS సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్లతో సమావేశమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.