తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు….

భారత్ న్యూస్ వరంగల్…తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు….

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు,

ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని చెప్పారు. ముఖ్యంగా నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు…..