భారత్ న్యూస్ రాజమండ్రి..ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో నేడు భారీ వర్షాలు: వాతావరణ శాఖ….
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ 23న నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పగలు, రాత్రి ఆకాశం మేఘావృతమై, రాత్రి 65% వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రత 36°C, కనిష్ట ఉష్ణోగ్రత 28°C, తేమ 53%గా ఉంటుందని వెల్లడించింది.

తెలంగాణలో పగటిపూట ఉరుములతో కూడిన జల్లులు, రాత్రి 65% తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో పలు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34°C, కనిష్ట ఉష్ణోగ్రత 26°C, తేమ 61%గా ఉంటుందని,
రెండు రాష్ట్రాల్లోనూ పడమర దిశ నుండి గంటకు 10 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది…