చేయూత పెన్షన్లలో భారీ ప్రక్షాళన

భారత్ న్యూస్ హైదరాబాద్ …చేయూత పెన్షన్లలో భారీ ప్రక్షాళన

తెలంగాణ :

చేయూత పెన్షన్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.

19.04 లక్షలకుపైగా లబ్ధిదారుల్లో 15.93 లక్షల మంది (83.88%) ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.

ఇంకా మూడు లక్షలకుపైగా మంది పూర్తి చేయాల్సి ఉంది.

ఈ ప్రక్రియ ద్వారా వేలాది అనర్హులను గుర్తించారు. ప్రజాధనాన్ని కాపాడుతూ, నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక పరిశీలన చేపట్టింది.

అనర్హులు పింఛన్లు పొందుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు.