రోడ్లు, పార్కుల స్థలాలకు LRS వర్తించదు: హైకోర్టు

భారత్ న్యూస్ హైదరాబాద్ …రోడ్లు, పార్కుల స్థలాలకు LRS వర్తించదు: హైకోర్టు

హైకోర్టు
లేఔట్లలో రోడ్లు, పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS) వర్తించదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపల్ సంస్థలకు అప్పగించిన స్థలాలు తిరిగి డెవలపర్, వ్యక్తుల అధీనంలోకి రావని, అలాంటి భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ మంజూరు చేయలేమని పేర్కొంది.

అయితే, మున్సిపల్ అధికారుల లేఖ ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం చట్టబద్ధం కాదని, ఇరుపక్షాల సమ్మతి లేదా కోర్టు ఆదేశం తప్పనిసరని హైకోర్టు తేల్చిచెప్పింది.