పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే సీఐ నాగరాజును ఇప్పటివరకూ

భారత్ న్యూస్ గుంటూరు…పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే సీఐ నాగరాజును ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు, ఆయనేమీ విదేశాలకు వెళ్లిపోలేదు కదా. ఆయన్ను అరెస్టు చేసి విచారిస్తే పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటికి వస్తాయని భయపడుతున్నారు. అసలు ఆయన్ను అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. అలాగే క్రాంతికుమార్‌ మే 21న ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు అనుమానాస్పద మృతి అని కేసు పెట్టారు. ఆ తర్వాత వీడియో బయటికి వచ్చిన తర్వాత తండ్రి ఫిర్యాదు చేసినా కేసులో ఎందుకు మార్పులు చేయలేదు.

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి