భారత్ న్యూస్ వరంగల్…తెలంగాణ : వారికి ఫ్రీగా ల్యాప్ టాప్‌లు
తెలంగాణ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది.
ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించాలని నిర్ణయించింది.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కీలక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేస్తుందని భావిస్తున్నారు.