కడియం నర్సరీలలో విషం కక్కుతున్న వింత పురుగు

భారత్ న్యూస్ రాజమండ్రి…తూర్పు గోదావరి…. కడియం

కడియం నర్సరీలలో విషం కక్కుతున్న వింత పురుగు

విశ్వవ్యాప్త ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులకు శాపంగా మారిన వింత పురుగు…

ఈ నర్సరీలో పనిచేసే రెక్కాడితే కానీ డొక్కడిని బ్రతుకులు… ఏ ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోయినా పస్తులు ఉండవలసిందే.

అలాంటి వారిపై యాసిడ్ పురుగులు దాడి చేసి అనారోగ్యానికి గురిచేస్తు, ఒంటిపై ఈ పురుగు పాకిన చోట పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడి అగ్ని మంట వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న కూలీలు….

నర్సరీ మొక్కలు లో భారీ స్థాయిలో వ్యాప్తి చెంది నర్సరీలో పనిచేసే కూలీలపై దాడి చేస్తున్న యాసిడ్ పురుగులు…

గత రెండు నెలలుగా ఈ పురుగులు నర్సరీల్లో అక్కడక్కడ కనిపించిన ఇటీవల కాలంలో లక్షల సంఖ్యలో వ్యాప్తి pచెందడంతో ఎక్కువైన ఈ పురుగులు దాడి…

దీనితో కూలీలు నర్సరీలకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న నర్సరీ రైతులు….

ఒంటిపై ఈ పురుగులు దాడి చేసిన చోట ఏర్పడే బొబ్బలు సుమారు 20 రోజుల వరకు తగ్గటం లేదని వాపోతున్న బాధితులు…

యాసిడ్ పురుగులను నియంత్రించేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని కాపాడాలని అభ్యర్థిస్తున్న రైతులు, రైతు కూలీలు..